మధుమేహం (చక్కర వ్యాధి ) అనేది రక్తం లో అధిక గ్లూకోజ్ స్థాయి కలిగి ఉండటం వల్ల వచ్చే ఒక రకమయిన రుగ్మత.
మధుమేహం ప్రతి వ్యక్తికి ఈ పదం పరిచయమే , మన ఇంట్లో దాదాపుగా ఎవరో ఒకరు దీనిని కలిగి ఉన్నవారే.
మధుమేహం అంటే ఏమిటి ?
మధుమేహం (చక్కర వ్యాధి ) అనేది రక్తం లో అధిక గ్లూకోజ్ స్థాయి కలిగి ఉండటం వల్ల వచ్చే ఒక రకమయిన రుగ్మత.
మధుమేహం వచ్చిందని లేదా వచ్చే అవకాశం ఉంది అని ఈ క్రింది కొన్ని లక్షణాల వల్ల తెలుసుకోవచ్చు :
- తరచుగా మూత్రానికి వెళ్లి రావడం
- అలసటగా అనిపించడం
- దాహంగా అనిపించడం
- కాళ్ళు చేతులలో జలదరింపు ,తిమ్మిర్లు మరియు నొప్పులు
- తరచుగా ఆకలిగా అనిపించడం
- మసకగా కనిపించడం
- పుండ్లు , గాయాలు త్వరగా తగ్గక పోవడం
- మెడ మీద మరియు బాహు మూలలలో నల్లని మచ్చలు
- అంగస్తంభన సమస్యలు
- దురద మరియు జనన అవయవాల దగ్గర ఇన్ఫెక్షన్స్
- బరువు తగ్గడం
- నోరు తడి ఆరిపోవడం
ఈ యొక్క లక్షణాలు కనపడితే మీ డాక్టర్ ని సంప్రదించి సలహాలు తీసుకోండి
అతను మీకు తగిన వైద్య పరీక్షలు చేసి మధుమేహం ఉందా లేదా అని నిర్ణయిస్తాడు
మీ యొక్క సూచనలు సలహాలు ఇక్కడ రాయండి
ఆరోగ్యాన్ని కాపాడుకోండి – సంతోషంగా ఉండండి