ప్రతి ఒక్కరు ఆరోగ్యముగా మరియు అందంగా ఉండాలని కోరుకుంటారు ,అందానికి & ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మనిషి ఆరోగ్యముగా ఉంటేనే అందంగా ఉండగలుగుతారు.
ప్రతి ఒక్కరు ఆరోగ్యముగా మరియు అందంగా ఉండాలని కోరుకుంటారు ,అందానికి & ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మనిషి ఆరోగ్యముగా ఉంటేనే అందంగా ఉండగలుగుతారు.
అందాన్ని కాపాడుకోవటం లో తల వెంట్రుకలది గొప్ప పాత్ర , స్వతహాగా భారతీయులు నల్లని అందమయిన కురులను కలిగి ఉంటారు . కానీ ఈ రోజులలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విధమయిన వెంట్రుకలకి సంబందించిన సమస్యను ఎదుర్కుంటున్నారు .
అందమయిన కురులకోసం శాస్త్రీయంగా రాసిన ఈ విలువయిన సమాచారాన్ని చదువుదాం
వెంట్రుకల సమస్యలు ఎన్ని రకాలు :
- చిన్న వయసులో తల నెరవడం (తెల్ల వెంట్రుకలు)
- తలలో చుండ్రు
- తలలో పేను కొరుకుడు
- వెంట్రుకలు ఊడిపోవడం
- బట్ట తల
ముఖ్యముగా చాల మంది బాధ పడేది తెల్ల వెంట్రుకల గురించి ఎందుకంటే ఈ సమస్యవల్ల చిన్న వయసులో పెద్ద వయసు వాళ్ల లాగ కనపడటం . భారతీయులకు నల్లని వెంట్రుకలు ఉండటం అందానికి చిహ్నం.
తెల్ల వెంట్రుకల సమస్యను అధిగమించడం ఎలా !!
మనం ఈ సమస్యను చాల మట్టుకు సహజ పద్దతుల ద్వారానే అధిగమించవచ్చు ,
ఈ సమస్యకు ఈ క్రింద కారణాలు కావొచ్చు –
- వెంట్రుకల ఆరోగ్యానికి సరిపోయే ఆహారాన్ని తినకపోవడం
- మానసిక ఒత్తిడి
- ఆరోగ్య సమస్యలు
- కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వెంట్రుకల మీద ప్రభావం చూపుతాయి
- ఉదా : PCOD , క్యాన్సర్ చికిత్సకు సంబందించిన కీమోథెరపీ
- థైరాయిడ్ సమస్యల వల్ల
- కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల
- హార్మోన్ సమస్యల వల్ల
- మెలనిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల
- వంశపారం పర్యంగా
అయితే ఇప్పుడు ఈ తెల్ల వెంట్రుకల సమస్య ఎలా పోవాలో తెలుసుకుందాం :
విటమిన్స్ :
కొన్ని రకాల విటమిన్ల లోపం వల్ల కూడా తెల్ల వెంట్రుకలు చిన్న వయసులో వస్తాయి అవి
విటమిన్ డి , విటమిన్ బి 6 , విటమిన్ బి 12 , విటమిన్ ఈ, బయోటిన్ ,విటమిన్ బి 9 (ఫోలిక్ ఆసిడ్ ) ,విటమిన్ బి 5 .
పోషకాలు ( nutrients ) :
ఈ క్రింది పోషకాల లోపం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు అవి క్యాల్షియమ్ , రాగి , ఇనుము ,కేరాటిన్ అనే ప్రోటీన్ మరియు జింక్ లోపం వల్ల కూడా .
తెల్లవెంట్రుకలు పోవడానికి /రాకుండా ఉండటానికి అద్భుతమయిన సూచనలు :
- ధూమపానం మానేయండి
- వెంట్రుకలకు సహజసిద్దమయిన షాంపూ నే వాడండి
- ప్రతి రోజు తల మీద నుండి స్నానం చేయకండి – వారానికి 2 లేదా 3 సార్లు చేయండి
- బయటకి వెళ్ళినప్పుడు తలకు ఏదయినా కట్టుకోండి ఎందుకంటే కాలుష్యం , దుమ్ము ధూళి నుండి రక్షణ కోసం.
- వెట్రుకలను శుభ్రపరచడానికి గోరువెచ్చని నీటినే వాడండి -అతి చల్లని లేదా వేడి నీరు వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి.
- తలకు రాత్రి పడుకునే ముందు మంచి సహజ మయిన ఆయుర్వేద నూనె తో మర్దన చేయండి
- చుండ్రు లేకుండా చూసుకోండి
- వేడికి గురికాకండి
- బయట జంక్ ఫుడ్ ని తినకండి
- తగినంత నీటిని త్రాగండి
- యోగ కానీ వ్యాయామం చేయండి – ఇది హార్మోన్స్ ని సమతుల్యముగా ఉంచుతుంది
- పండ్ల జ్యూస్ , క్యారట్ & బీట్ రూట్ జ్యూస్ ని తరచుగా తాగండి
- కెమికల్ ఉన్న హెయిర్ డైస్ కానీ నూనెలను కానీ అసలే వాడకండి
- ప్రతి రోజు తప్పకుండ 15 నిముషాలు ధ్యానం చేయండి ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది .
- మంచి పోషకాలతో కూడుకున్న ఆహారాన్ని తినండి
- మీకు సరిపడా కూరగాయలు మరియు ఆకుకూరలు ప్రతి రోజు తినండి
- గ్రీన్ టీ ని త్రాగండి దీంట్లో యాంటీఆక్సిడాంట్స్ ఉంటాయి
- ప్రతి రోజు 5 బాదాం పలుకులు తినండి – విటమిన్ ఈ -కోసం
- ప్రతి దినం ఒక కప్పు మొలకెత్తిన విత్తనాలు తినండి
- అన్ని రకాల పండ్లను తినాలి
- ప్రతి వ్యక్తికి రోజుకు 1.3 మిల్లి గ్రా // విటమిన్ బి 6 అవసరం , ఇది తృణధాన్యాలలో , ఆకుకూరలలో, సొయా లో ఉంటుంది .
- పాలు మరియు జున్నులో విటమిన్ బి 12 ఉంటుంది ఇది వెంట్రుకల ఆరోగ్యానికి చాల అవసరం.
- ప్రొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు -వీటిలో విటమిన్ ఈ , మరియు జింక్ ఉంటుంది .
- ఉసిరికాయలను ఆహారం లో వాడండి -ఇవి విటమిన్ సి, మరియు యాంటీఆక్సిడాంట్స్ కలిగిఉంటాయి .
- బెర్రీ పండ్లు మరియు బత్తాయి
- అరటి పండ్లు తినండి వీటిలో మెగ్నీషియం మరియు జింక్ ఉంటాయి
- కరివేపాకు ను వంటలలో వాడండి లేదంటే రోజుకు 2 చెంచాల కరివేపాకు పొడిని అన్నం లో కలువుకుని కానీ ఇడ్లి లతో పాటుగా తినండి.
- వీలయితే కుంకుడు కాయలను వెంట్రుకలు శుభ్రపరుచుకోవడానికి వాడండి
- పరిశుభ్రమయిన నీటిని తగినంత త్రాగండి
- వారానికి 2 సార్లు కలబంద గుజ్జును వెంట్రుకలకు మర్దన చేసి 15 నిమి// తర్వాత సహజమయిన షాంపూ తో తలస్నానం చేయండి.ఇది మీ తల వెంట్రుకలకు మంచి నిగారింపు ఇస్తుంది & సహజమయిన కండీషనర్ గా పనిచేస్తుంది
ఇతర ముఖ్యమయిన సూచనలు :
- ధూమపానం మానేయండి
- వెంట్రుకలకు సహజసిద్దమయిన షాంపూ నే వాడండి
- ప్రతి రోజు తల మీద నుండి స్నానం చేయకండి – వారానికి 2 లేదా 3 సార్లు చేయండి
- బయటకి వెళ్ళినప్పుడు తలకు ఏదయినా కట్టుకోండి ఎందుకంటే కాలుష్యం , దుమ్ము ధూళి నుండి రక్షణ కోసం.
- వెట్రుకలను శుభ్రపరచడానికి గోరువెచ్చని నీటినే వాడండి -అతి చల్లని లేదా వేడి నీరు వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి.
- తలకు రాత్రి పడుకునే ముందు మంచి సహజ మయిన ఆయుర్వేద నూనె తో మర్దన చేయండి
ఉదా : మందార నూనె , బృంగరాజ నూనె , కొబ్బరి నూనె , ఇంకా నిపుణులు సూచించబడిన నూనెలు .
- చుండ్రు లేకుండా చూసుకోండి
- వేడికి గురికాకండి
- బయట జంక్ ఫుడ్ ని తినకండి
- తగినంత నీటిని త్రాగండి
- యోగ కానీ వ్యాయామం చేయండి – ఇది హార్మోన్స్ ని సమతుల్యముగా ఉంచుతుంది
- పండ్ల జ్యూస్ , క్యారట్ & బీట్ రూట్ జ్యూస్ ని తరచుగా తాగండి
- కెమికల్ ఉన్న హెయిర్ డైస్ కానీ నూనెలను కానీ అసలే వాడకండి
- ప్రతి రోజు తప్పకుండ 15 నిముషాలు ధ్యానం చేయండి ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది .
ఇలా మీరు కొన్ని వారాలు క్రమం తప్పకుండ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి .
ఎల్లప్పుడూ ఆరోగ్యముగా మరియు అందముగా ఉండండి