ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడానికి ప్రయత్నిస్తారు, అయినప్పటికీ దానిని ఆచరణలో ఉంచే విషయంలో మనమందరం ఏదో ఒక సమయంలో విఫలమవుతాము.
మనం ఆరోగ్యంగా ఉంటె అన్ని సాధించినట్టే అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ..
ఈ రోజుల్లో ప్రతి కుంటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం తో బాధపడుతున్నారు
ఈ రోజు, మీ లక్ష్యాలను చేరుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించే ఆరోగ్యకరమైన అలవాట్లను మీకు నేర్పించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము!
మీ జీవితాన్ని మరింత ఉత్పాదకంగా మెరుగుపరచడానికి ఈ పరిపూర్ణమైన జీవనశైలిని అలవాటు చేసుకోండి.
ఈ 5 అలవాట్లను తప్పకుండ పాటించండి :
1. మీ శరీరాన్ని కదిలించండి:
మీ శరీరం కదలికలను ఇష్టపడుతుంది , ఈ కదలికలు మీ శరీరం బరువును నియంత్రణలో ఉంచడానికి , కండరాలు మరియు ఎముకలను బలోపేతం చేయడానికి తగినంత శారీరక శ్రమ అవసరం.
దీన్ని మనం ఈ రోజుల్లో వ్యాయామం ద్వారా పొందుతున్నాం .లేదంటే సహజంగా మనం చేసుకునే పనుల వల్ల పొందుతుంటాము
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ప్రపంచంలోని 60 నుండి 85% మంది ప్రజలు నిశ్చల జీవనశైలిని గడుపుతున్నారు.
అంటే ఒక మాటలో చెప్పా లంటే శరీరానికి తగిన శారీరక శ్రమను ఇవ్వకుండా ఉండటం .
దీని వల్ల తక్కువ వయస్సులో కూడా , హృదయ సంబంధిత వ్యాధులు , సడన్ కార్డియాక్ అరెస్ట్ , మధుమేహం , అధిక బరువు , చర్మ వ్యాధులు , క్యాన్సర్ , మహిళలో రొమ్ము క్యాన్సర్ , థైరోయిడ్ , వంటి ఎన్నో సమస్యలు ఎదురు కావొచ్చు .
2. ఆరోగ్యకరమైన ఆహారం:
మీ ఆహారపు అలవాటు మీ ఆరోగ్యానికి నేరుగా సంబంధం ఉంటుంది. కాబట్టి, ప్రతి ఋతువులో దొరికే ఆహారం తినడం , శుభ్రమయిన ఆహారాన్ని తినడం, ఎక్కువగా నూనెలు వేపుడు లేని ఆహారాన్ని వండుకోవడం , అన్ని రకాల పళ్ళు తినడం మంచి ఆహారపు అలవాటు అవుతుంది ..
జంక్ ఫుడ్ తినడం , బయట దొరికే ఆహారం మీద ఆధారపడటం తిగ్గించుకోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను అయినా సరైన ఆహార నిర్వహణతో తగ్గించుకోవచ్చు .
ఆరోగ్యకరమైన ఆహారం అన్ని రకాల పోషకాహార లోపం నుండి రక్షించడానికి సహాయపడుతుంది
3. మానసిక శ్రేయస్సును ప్రోత్సహించండి:
మీ శారీరక శ్రేయస్సు ఎంత ముఖ్యమో మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీతో సమయం గడపండి మరియు మీ అంతరంగాన్ని అర్థం చేసుకోండి!
మానసిక ప్రశాంతత కోసం ధ్యానం సాధన చేయండి.
4. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి :
చదవడం మీ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మంచి కోసం మిమ్మల్ని ప్రేరేపించే ఉత్తమ పుస్తకాలను చదవండి. పడుకునే ముందు చదవడం వల్ల మీకు అంతరాయం లేని నిద్ర పడుతుంది .
ఎక్కువగా నేర్చుకునే ప్రయత్నం చేయండి ..దీన్ని వల్ల జ్ఞానం మరియు ప్రశాంతత వస్తుంది ..మీ యొక్క విజయం మీరు నేర్చుకోవడం మీద నే ఆధారపడుతుంది .
5. మీ ఒత్తిడిని నియంత్రించుకోండి:
ఈ ఆధునిక ప్రపంచం లో మనం అనుభవిస్తున్నది ఒత్తిడి …. అన్ని ఉన్నా కూడా ఏదో ఒక మానసిక ఆందోళన ఇప్పుడు పట్టి పీడిస్తున్న సమస్య …
ఎక్కువగా డబ్బులు సంపాందించాలనే ఆరాటం , ఉన్నత చదువులు చదవాలనే ఆకాంక్ష , కుటుంబ సౌఖ్యం లేకపోవడం , ఇంకా ఎన్నో కారణాలు ఈ ఒత్తిడి కి మూలం …
మీ ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నించండి. ఒత్తిడి లేని జీవన మార్గాన్ని అవలంబించుకోవడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండచ్చు…
మీకు నచ్చిన పనిని చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది , ఆటలు , మంచి అలవాట్లు , నడక , దూరపు ప్రదేశాలు చూడటం , ప్రియమయిన మిత్రులతో మాట్లాడటం , మంచి కుటుంబ సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఒత్తిడి ని అధిగమించవచ్చు …
మనం చదివిన ఈ 5 అద్భుతమయిన అలవాట్లను ఒక 40 రోజులు ఆచరించి చూడండి అద్భుతమయిన ఫలితాలను మీరే చూస్తారు …