లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ని ముఖ్యంగా హార్ట్ కు సంబంధినచిన ఆరోగ్య సమస్యలను గుర్తించడం కోసం డాక్టర్స్ చేయించమంటారు.
మనం తరచుగా వినె మాట లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నావా !!
అసలు ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం …
లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ని ముఖ్యంగా హార్ట్ కు సంబంధినచిన ఆరోగ్య సమస్యలను గుర్తించడం కోసం
డాక్టర్స్ చేయించమంటారు .
లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ వల్ల కొలెస్ట్రాల్ కు సంబందించిన సమాచారాన్ని తెలుసుకుంటాము ,
అవి :
- HDL C – హై డెన్సిటీ లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ ” మంచి కొలెస్ట్రాల్ “
- LDL C – లో డెన్సిటీ లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ ” చెడు కొలెస్ట్రాల్ “
- LDL / HDL కు సంబందించిన సమాచారం (అనగా ఎంత ఉంది )
- ట్రైగ్లిసెరైడ్స్
- VLDL C – వెరీ లో డెన్సిటీ లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్
మొత్తం కొలెస్ట్రాల్ యొక్క సమాచారం ఈ యొక్క టెస్ట్ వల్ల తెలుస్తుంది
కొలెస్ట్రాల్ అనేది మన శరీరం లో ఉండే ఒక రకమయిన క్రొవ్వు పదార్థం , మంచి క్రొవ్వు లు మంచి చేస్తాయి అలాగే చెడు కొవ్వులు చెడు చేస్తాయి .
చెడు క్రొవ్వు ఎక్కువగా ఉంటె మన హృదయినికి రక్తాన్ని చేరవేసే సామర్థ్యము హృదయానికి సంబందించిన రక్త నాళాలకు తగ్గుతుంది ,దీని వలన హార్ట్ ఎటాక్ / గుండె పోటు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి .
అందుకే గుండె పోటు ను ముందుగ నివారించడానికి మరియు గుండె అరోగ్యాన్ని కాపాడటానికి మన డాక్టర్స్ ఈ లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ ని చేయించమంటారు .
ఈ టెస్ట్ మిగతా అవయవాలను కాపాడు కోవటానికి కూడా ఉపయోగ పడుతుంది .
ఎవరు దీనిని చేయించు కోవాలి :
- డాక్టర్ సలహా ప్రకారం
- పొగ త్రాగే అలవాటు ఉన్నవాళ్లు
- శారీరక శ్రమ లేని వాళ్ళు
- మధుమేహం & హైపర్ టెన్షన్ ఉన్నవాళ్లు
- కుటుంబం లో ఎవరికయినా హార్ట్ కు సంబందించిన సమస్యలు ఉన్నవాళ్లు
- ముందుగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు
- ఎక్కువ బరువుతో బాధ పడేవాళ్ళు
- ఎక్కువగా బయట తిండి తినే వాళ్ళు
ఈ టెస్ట్ ను చేయించు కునే ముందు 12 గంటలు లేదా 14 గంటల ముందు ఏలాంటి ఆహారం మరియు ద్రవ పదార్థాలు తీసుకోరాదు .
నీళ్లు త్రాగవచ్చు కానీ మరి అంతగా కాదు ‘
టీ , కాఫీ మరియు ఇతర పానీయాలు త్రాగరాదు .
ఈ టెస్ట్ చేయించు కోవాలంటే ఇక్కడి సంప్రదించండి మరియు పొందండి ఎక్కువ తగ్గింపు , మీ ఇంటి వద్దనే టెస్ట్ చేయించుకునే సౌకర్యం