Vishnu Sahasranamam Chanting Benefits In Telugu-విష్ణు సహస్రనామ పారాయణం వల్ల అద్భుత ప్రయోజనాలు

Vishnu Sahasranamam Chanting Benefits In Telugu

రచయిత : ఇ.పవన్ కుమార్ శర్మ

 

శ్రీ  విష్ణు సహస్రనామం లోని 1000 నామాలు చాలా శక్తివంతమైనవి, ముఖ్యంగా ఈ కలియుగంలో, 

మన దైనందిన జీవితంలో వచ్చే ఏవైనా ఇబ్బందులను తట్టుకునే శక్తిని మరియు సామర్థ్యాన్ని ఇస్తాయి.

విష్ణు సహస్రనామం == అనగా భగవాన్ విష్ణువుకి సంబందించిన 1000 నామాలు (పేర్లు).

మహాభారతం ప్రకారం, కురుక్షేత్ర యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు చాలా కలత చెందాడు మరియు అసంతృప్తి చెందాడు.

గొప్ప వాడయిన భీష్మ పితామహుడు తన మరణం కోసం ఎదురు చూస్తున్నాడు, మరియు యుధిష్ఠిరుడు మానసిక ప్రశాంతతను కోరుతూ ఆయన వద్దకు వచ్చాడు… వారి సంభాషణ సమయంలో, భీష్ముడు మానసిక వేదనను అధిగమించడానికి శ్రీ విష్ణు సహస్రనామం జపించమని యుధిష్ఠిరుడిని కోరాడు..

Vishnu Sahasranamam Benefits In Telugu


శ్రీ విష్ణువు యొక్క 1000 నామాలను జపించడం వల్ల మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

అందుకే మనం ప్రతిరోజూ శ్రీ విష్ణుసహస్రనామం జపించగలిగితే, అది మన దైనందిన జీవితంలో వచ్చే కష్టాలను తట్టుకునే శక్తిని ఇస్తుంది.

ఈ కలియుగం లో మనకు ఉన్న ఒక అద్భుత దైవారాధనకు సంబందించిన గొప్ప స్తోత్రాలలో
విష్ణు సహస్రనామం ఒకటి .

ఈ నామాలు మన నిత్య జీవితం లో అనునిత్యం భక్తి తో పఠిస్తే అనేకమయిన మానసిక వైకల్యాలలను అధిగమిస్తాము .

 

విష్ణు సహస్రనామం మహాభారతం యొక్క సారాంశం అని చెప్పబడుతుంది.


మూలం :

విష్ణు సహస్రనామం మహాభారతం లోని అనుశాసనిక పర్వం 149 వ అధ్యాయం
లో ఉంది

యుధిష్టరుడు భీష్మ పితామహు న్ని ఇలాంటి ప్రశ్నలు అడిగాడు …

ఒకే ఒక పరమ దేవత ఏమిటి

ఒకే ఒక పరమ ఆశ్రమం ఏమిటి ?
ఎవరిని కీర్తించడం ద్వారా మనిషి శుభాన్ని పొందగలడు
ఎవరిని కీర్తించడం ద్వారా మనిషి శాంతి మరియు శ్రేయస్సును పొందగలడు ?
మీ అభిప్రాయం ప్రకారం గొప్ప ధర్మం ఏమిటి ?
దేని జపం ద్వారా మనిషి సంసార బంధనాలను దాటి వెళ్ళగలరు ?

అప్పుడు భీష్ముడు అది విష్ణు సహస్రనామాన్ని జపించడం ద్వారా సాధ్యపడుతుందని జవాబిచ్చి , విష్ణు సహస్రనామాన్ని యుధిష్ఠరునికి బోధించాడు ..


విష్ణు సహస్రనామాలు జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు :

Vishnu Sahasranamam Chanting Benefits In Telugu

ఆధ్యాత్మిక ప్రయోజనాలు:
భక్తి మరియు విశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది  మరియు  భగవంతుని మీద అచంచలమయిన విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

భక్తి మరియు విశ్వాసం :
ఈ నామాలను క్రమం తప్పకుండ జపించడం వల్ల విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ,దైవిక ఉనికి మరియు మార్గదర్శకత్వం పెంపొందుతుంది ..

మనసును శుద్ధి చేస్తుంది:
ఈ పవిత్ర శ్లోకాలు మనస్సును ప్రతికూలత నుండి శుద్ధి చేస్తాయని, ఆధ్యాత్మిక వృద్ధిని మరియు ప్రశాంతతను ప్రోత్సహిస్తాయని నమ్ముతారు.

మోక్ష ప్రాప్తి (మోక్షం):
భక్తితో, విశ్వాసంతో జపించడం వల్ల జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

ప్రతికూలతలను అధిగమించడం:
సహస్రనామం పురోగతికి ఆటంకం కలిగించే అడ్డంకులు, మరియు ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడుతుందని చెప్పబడింది.

పురోగతి కోసం :
శ్రీ మహా విష్ణువు సహస్ర నమాలను చదవడం వల్ల జీవితానికి సంబందించిన అడ్డంకులు మరియు ప్రతికూల శక్తులు తొలగించబడతాయి .

మానసిక స్థైర్యం :
ఈ నామాలు నిత్యం పఠించడం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది , ఆత్మ బలం పెంపొందుతుంది . మానసిక పరిపక్వత వస్తుంది .

మోక్షం :
వీటిని జపించడం వల్ల మోక్షానికి మార్గం లభిస్తుంది అంతిమ సత్యాన్ని అర్థం చేసుకుని మోక్షమార్గం లో నడవవచ్చు .

జ్ఞానం :
జ్ఞానం అంటే మంచి చెడు ను తెలుసుకుని జీవితం లో ముందుకు వెళ్లడం , ఈ జ్ఞానం విష్ణు సహస్రనాలను చదవడం వల్ల వస్తుంది .

ప్రశాంతత: 
మానసిక ప్రశాంతత లభిస్తుంది , వీటిని చదివిన తరువాత మనస్సు నిర్మలమవుతుంది.

పెండ్లి కోసం :

విష్ణుసహస్రనామ పారాయణం వల్ల పెండ్లి కాని యువతీ యువకులకు పెండ్లి అవుతుందని నమ్మకం .

ఆర్థిక అభివృద్ధి కోసం :
విష్ణుసహస్ర నామ పారాయణం వల్ల ఆర్థిక సంబంధమయిన అవరోధాలను అధిగమిస్తాము అని విశ్వాసము

దుర్గుణాలను పారదోలుటకు :
మనిషిలో ఉండే అహంకారం , గర్వము మరియు కోపం వంటి గుణాలను ఈ నామాలు జపించడం వల్ల తగ్గించుకోవచ్చు.

జాతక గ్రహ దోషాలు :
జాతక రీత్యా గురు , బుధ , శని , కుజ గ్రహ దోషాల వల్ల కలిగే దుష్ప్రభావాలను అధిగమించడానికి విష్ణు సహస్ర నామ పారాయణం శ్రేయస్కరం

 

పరమాత్ముడు ఎవరు :
వసుర్వవసుమనాసత్య : సమాత్మా సమ్మిత : నమ:
అమోఘ: పుండరీకాక్షో వృషాకర్మా వృషాకృతి:

ప్రశస్తమయిన మనసు కలిగినవాడు , రాగ ద్వేష దోషాలు లేవు కావున అత్యంత శ్రేష్ఠమయిన మనస్సు కలిగినవాడు పరమాత్మ .

ఏ సమయం లో పఠించాలి

1 . ఉదయం ఇంకా వీలయితే  బ్రహ్మ ముహూర్తం సమయం లో
2 . సూర్యాస్తమయం సమయం లో / గోధూళి సమయం లో
3 . రాత్రి సమయం లో పడుకునే ముందు
4 . విష్ణువుకి ఇష్టమయిన ఏకాదశి దినాలలో


విష్ణు సహస్రనామాలు ఎలా జపించాలి ?

మనం ఏదయినా ఇష్టదైవాన్ని నిర్మలమయిన మనస్సుతో ఆరాధన చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి …
అలానే విష్ణు సహస్రనామాలను కూడా ప్రతి రోజు ఒక నిర్దిష్టమయిన సమయం లో ప్రశాంత మయిన స్థలం లో కూర్చుని చదవాలి , మొదటి సారి చదవటానికి 60 నిమిషముల కంటే ఎక్కువ సమయం తీసుకోవచ్చు …అలవాటు అయినాక ఒక 30 నిమిషాల వరకు నెమ్మదిగా అక్షర దోషం లేకుండా చదవాలి

40 రోజులు దీక్షగా రోజు చదవచ్చు
1 సంవత్సరం అయినా చదవచ్చు
ప్రతిరోజు నిరంతరాయంగా కూడా చదవచ్చు
బుధవారం మరియు ఆదివారం అయినా కూడా చదవచ్చు (ఏవయినా ఒక రెండు లేదా కానీ మూడు రోజులు చదవచ్చు )
నూతన గృహప్రవేశ సమయం లో కూడా చదవచ్చు

 

ధన్యవాదములు

Note : ఈ యొక్క ఆర్టికల్ కు ఆధారం : గ్రంథాలు , సాధకుల అభిప్రాయాలూ , పండితుల యొక్క ఉపన్యాసాలు

 

ఈ వ్యాసం మీద మీ యొక్క సూచనలు , అభిప్రాయాలూ మరియు ఇంకా ఎక్కువ సమాచారం కోసం :9398601060

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *