8 Watermelon Benefits In Telugu

Watermelon Benefits In Telugu

29-03-2025

రచయిత : ఇ.పవన్ కుమార్

వాటర్మిలాన్ ఈ పండుని తెలుగులో పుచ్చకాయ అని పిలుస్తాం కర్బుజా అని కూడా పిలుస్తాం .కర్బుజా అనే పదం ఉర్దూ భాష నుండి వచ్చింది .

వివరంగా Watermelon Benefits In Telugu లో తెలుసుకుందాం 

ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినే పండు పుచ్చకాయ ..
రుచికరం గా నే కాకుండా దీని లో అనేక పోషకవిలువలు ఉంటాయి ..
ముఖ్యంగా వేసవి కాలం లో ఈ పండుని తింటాం ..

పుచ్చకాయ శరీరానికి చలువదనాన్ని కలిగిస్తుంది. దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు వేసవిలో ఎక్కువగా తినే పండు ఇదే కావొచ్చు ..

 

1 నీటి లభ్యత

దీని లో  90 %  వరకు నీరే ఉంటుంది ,అందుకే వేసవి కాలం లో మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా  ఇది  మనల్ని కాపాడుతుంది .
వేసవి కాలం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయం లో దీన్ని తింటే మన శరీరం అలిసిపోదు మరియు వడ దెబ్బ కి గురికాకుండా కాపాడుతుంది.

 

2. పోషక విలువలు మెండు

దీని లో విటమిన్ ఎ , విటమిన్ సి , విటమిన్ బి 6 , పొటాషియం , మరియు మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఈ విటమిన్ ల వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది .

 

3. గుండె ఆరోగ్యం కోసం

పుచ్చకాయ లో ఉండే లైకోపీన్ అనే యాంటియోక్సిడెంట్స్ హార్ట్ కు సంబందించిన రుగ్మతల నుండి కాపాడుతుంది .ఇది చెడు క్రొవ్వు (కొలెస్టరాల్ ) మరియు అధిక రక్త పోటును తగ్గిస్తుంది .

 

4. జీర్ణక్రియ

దీనిలో ఉండే పీచు మరియు అధిక నీటి శాతం వల్ల జీర్ణ క్రియ మెరుగవుతుంది మరియు జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది .

 

5. వెయిట్ లాస్

పుచ్చకాయ లో క్యాలోరీలు మరియు ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ కావడానికి దోహదపడుతుంది

 

6. రోగ నిరోధక శక్తి

విటమిన్ సి ఇందులో ఉండటం వల్ల రోగనిరోధకశక్తి పెరగడానికి దోహదపడుతుంది .ఈ శక్తి వల్ల వ్యాధులు సంక్రమించకుండా ఉపయోగపడుతుంది .

 

7. చర్మం మరియు వెంట్రుకలకు 

విటమిన్ ఎ మరియు విటమిన్ సి కలిగివుండటం వల్ల ఆరోగ్యకరమయిన చర్మానికి మరియు వెంట్రుకలకు ఉపయోగపడుతుంది .


8. ఎముకల ఆరోగ్యం కోసం 

దీని లో ఉండే సిట్రుల్లిం అనే ఎమినో ఆసిడ్ వల్ల ఎముకల లో వచ్చే ఒక రకమయిన అసౌకర్యం,

నొప్పిని ని తగ్గిస్తుంది, అలానే వ్యాయామం చేసిన తరువాత వచ్చే నొప్పి ని తగ్గిస్తుంది.

 

9. మెరుగైన కంటి ఆరోగ్యం కోసం

కంటి చూపు మరియు కంటి ఆరోగ్యం కోసం పుచ్చకాయ ఉపయోగపడుతుంది , దీని లో విటమిన్ ఎ మరియు లైకోపీన్ కంటి ఆరోగ్యానికి దోహదపడతాయి .అలానే శరీరం లో కలిగే మండే స్వభావాన్ని తగ్గిస్తుంది .

 

100 గ్రామ్ ల కర్బుజా లో ఉండే పోషకాలు

కేలరీలు                             30 కిలో క్యాలరీలు
నీటి శాతం                          90 %
కార్బో హైడ్రేట్స్                    7.6 g
చక్కర                               6.2 g
పీచు                                 0.4 g
ప్రోటీన్                              0.6 g
కొవ్వు                                0.2 g
విటమిన్ సి                        8.1 mg
విటమిన్ ఎ                        28µg (1% RDA)
పొటాషియం                       12mg
మేగ్నెసియం                      10mg
లైకోపీన్                             4,500µg

 

పుచ్చకాయను ఎలా తినాలి 
పుచ్చకాయను కొన్న తరువాత కొద్ది సేపు నీటిలో నానబెట్టి కడిగి తినడం శ్రేయస్కరం ..

1 . చిన్న ముక్కలుగా
2 . మిగతా పండ్ల తో సలాడ్ గా
3 . పుచ్చకాయ రసం
4 . మెత్తని గుజ్జుగా

పుచ్చకాయను వాటిలో ఉండే విత్తనాలతో పాటు గా తినాలి , ఈ విత్తనాల లో మనకు కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి , ఈ పోషకాలు మధుమేహ నియంత్రణలో , మరియు కాన్సర్ రాకుండా కాపాడుతాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *