ప్రపంచం మొత్తం మీద రమారమి కొన్ని కోట్ల మంది ఊబకాయం తో బాధపడుతున్నారు దీంట్లో పురుషులు 11 % మహిళలు 15 % ఊబకాయం అధిక బరువుతో బాధపడుతున్నారు.
ప్రపంచం మొత్తం మీద రమారమి కొన్ని కోట్ల మంది ఊబకాయం తో బాధపడుతున్నారు
దీంట్లో పురుషులు 11 % మహిళలు 15 % ఊబకాయం అధిక బరువుతో బాధపడుతున్నారు.
మనయొక్క ఆధునిక జీవన విధానం వల్ల బరువు పెరగడం ఊబకాయం సమస్యలు వస్తున్నాయి.
ప్రతిరోజూ మనం తినే ఆహారానికి సరిపడా శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఇప్పుడు మన ఇళ్లలో అన్ని పనులు మన శ్రమ అవసరం లేకుండా జరిగిపోతున్నాయి .
ప్రతి పనికి పనిమనిషి మీద ఆధారపడటం లేదా ఏదయినా యంత్రం మీద ఆధారపడటం వల్ల శరీరం లో నిలువ ఉన్న కేలరీలు ఖర్చు చేయలేకపోతున్నాం ఇది ఊబకాయానికి దారి తీస్తుంది .
మీరు బరువు తగ్గాలంటే రెండు ముఖ్యమయిన సూచనలు ఆచరించండి,
ఒకటి : మనం తినే ఆహారాన్ని బరువు తగ్గడానికి సరిపోయేటట్టుగా మార్చుకోవడం
రెండు : మనం తినే ఆహారానికి తగినంతగా శారీరక శ్రమ చేయడం అంటే ఏదో ఒక విధంగా కేలరీలు కరిగించడం
ముందుగా అధిక బరువు అంటే ఏమిటో తెలుసుకుందాం
మనిషికి యొక్క శరీర బరువును ఎత్తు తో పద్దతి ప్రకారం కొలిచినప్పుడు మనకు
BMI విలువ వస్తుంది ,
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం(WHO ) వ్యక్తి యొక్క BMI 30 కంటే ఎక్కువ గా ఉంటె ఆ వ్యక్తి అధిక బరువు ఉన్న వ్యక్తి గా పరిగణించబడతాడు .
అధిక బరువు ఉంటె కలిగే ఇబ్బంది ఏమిటో చూద్దాం ..
మన వైద్యులు ఆరోగ్య సంస్థలు చెప్తున్నదేమిటంటే ఎన్నో వ్యాధులకు అధిక బరువు అనేదే ముఖ్య కారణం .
అధిక బరువు వల్ల కలిగే నష్టం
- కీళ్ల నొప్పులు
- గుండెకు సంబందించిన సమస్యలు
- సంతాన లేమి
- క్యాన్సర్ ఇంకా మరెన్నో సమస్యలకు పుట్టినిల్లు అధిక బరువు తో ఉండటం
- హైపర్ టెన్షన్ ( అధిక రక్తపోటు ) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది
- మధుమేహం – భారత దేశం లో దాదాపు 77 మిలియన్ ప్రజలు మధుమేహంతో బాధ పడుతున్నారు .
అధిక బరువు అనేది కూడా దీనికి ఒక కారణమే .
ఊబకాయం / అధిక బరువు తగ్గాలంటే ఎలా ?
ప్రతి రోజు ఆచరించాల్సినవి తెలుసుకుందాం
- ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పిండుకుని తాగాలి
ఇది విరేచనం సాఫీగా కావడానికి మరియు శరీరం లో ఉండే మలిన పదార్తాలు వెళ్లి పోవడానికి ఉపయోగపడుతుంది
ఆయుర్వేదం ప్రకారం ఇది మంచి వెయిట్ లాస్ సహజమయిన మందు
- అలాగే ప్రొద్దున తగినంత నీరు త్రాగండి .
- విరేచనం సాఫీగా అయ్యేటట్టు చూసుకోండి
- ప్రతిరోజూ ప్రొదున్న ఉదయము 5 గం లేదా 6 గం మధ్యలో లేచి 30 నిమిషాలు లేదా 40 ఒక మోస్తరు వేగంతో నిముషాలు నడవాలి
నడవటం తో పాటు కొన్ని బరువును తగ్గించే కార్డియో వ్యాయామాలు చేయాలి
ఉదారణకు : స్కిప్పింగ్ / తాడు ఆట/ఈతకొట్టడం – బరువు తగ్గటానికి ఇవి మంచి వ్యాయామాలు .
ఉదయము అల్పాహారం ను మానకండి
- మధ్యాహ్న భోజనాన్ని వీలయినంత మట్టుకు 12 గం నుండి 1 గం మధ్యలో చేయండి
- సాయంత్రం 4 గం సమయం లో టీ తో పాటు చిన్న ఆహారం తీసుకోండి
(ఉదా :మొలకెత్తిన పెసలు)
- రాత్రి భోజనాన్ని 8 గం ల లోపు ముగించండి
- పడుకునే ముందు 1 గ్లాస్ గోరు వెచ్చని నీరు త్రాగండి
- రాత్రి 9 గం ల వరకల్లా పడుకోండి
బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి :
- అన్ని రకాల ఋతువులకు సంబంధించిన కాయ కూరలు ఆకు కూరలు తినండి
- ప్రతి రోజు మధ్యాహ్న భోజనం లో ఒక ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి
- ప్రతి రోజు 150 గ్రా ఆకుకూరలు తినండి
(ఉదా : తోటకూర , గంగావాయలు , పాలకూర , బచ్చలి ,పొనగంటి , మెంతి పంటి కూర)
- అన్నం తో పాటుగా రోటి తినండి జొన్న రొట్టె , గోధుమ రొట్టె మరేదయినా
- ప్రతిరోజూ ఏదో ఒక సమయం లో చిరుధాన్యాలు తినండి
ఉదా: రాగులు (రాగి జావా) , జొన్న తో చేసిన పదార్తాలు
చిరు ధాన్యాలు తింటే ఆకలి తొందరగా కాదు ,వీటిలో మనకు తగినంత పోషక పదార్తాలు
మరియు పీచు పదార్తాలు ఉంటాయి .
మనకు ప్రతిరోజూ 25 గ్రాముల నుండి 40 గ్రాముల వరకు పీచు అవసరం అందుకే చిరు ధాన్యాలు తినాలి.
పీచు పదార్తాలు ఎక్కువగా తింటే కాన్సర్ కూడా రాదు
- కనీసం దినం లో 3 నుండి 4 లీటర్ల మంచి పరిశుభ్రమయిన నీటిని త్రాగండి
బరువు తగ్గే దాంట్లో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది నీరు అనవసరపు ఆకలిని కానీయదు, శరీరాన్ని అలసిపోనీయదు, అనవసరపు క్రొవ్వును కరిగిస్తుంది మరియు విషపదార్తాలను బయటకి పంపుతుంది .
వీలయితే కాచి చల్లార్చిన నీటినే త్రాగండి వారానికి 2 రోజులు రాగిపాత్రలో రాత్రి ఉంచుకొన్న నీటిని (5 తులసి ఆకులను వేసి ఉంచండి ఆ రాగి పాత్రలో) తెల్లవారి త్రాగండి .
- ఉప్పు వాడకాన్ని ఆహారపదార్తాలలో తగ్గించండి
- తెల్లని పంచదార వాడకాన్ని తగ్గించండి
- వంటలలో నూనె వాడకాన్ని తగ్గించండి
- వీలయితే ఆలివ్ ఆయిల్ ని వాడండి కానీ ఇది అన్ని వంట నూనెల కంటే ఎక్కువ ధర.
- క్యారోట్స్ , బీట్రూట్ ,దోసకాయ ,సోరకాయ , బీరకాయ ,పచ్చి బఠాణి , విటమిన్ సి ఉన్న పండ్లు అనగా నిమ్మ , బత్తాయి వీటిని తరచుగా తినండి.
- టమాటాలు , బ్రోకలీ,అల్లం ,వెల్లి , ఉల్లి ,పుదీనా తరచుగా తినండి .
- పచ్చి మిర్చి , మిరియాలు , వాము ,పసుపు ను ప్రతిరోజూ వంటలలో వాడండి
- మిరియాల పొడిని పండ్ల ముక్కల మీద కానీ దోస కాయ ముక్కల మీద చల్లుకుని తినండి.
- బాదం ను రోజు ప్రొద్దున కానీ ఉదయపు అల్పాహారం లో అయినా తినండి
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ అధ్యయనం ప్రకారం రోజు బాదం తింటే బరువు తగ్గవచ్చు అని
- ఆల్కహాల్ ను మానేయండి
- బయట తిండి ని మానేయండి
- పిజ్జా అలాంటి వాటి జోలికి అసలే పోకండి
- కూల్డ్రింక్స్ ని త్రాగకండి వీటి వల్ల బరువు పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి
- మైదా మరియు వేయించిన ఆహారాన్ని మొత్తానికే మానేయండి
- మొలకెత్తిన విత్తనాలను ప్రతిరోజూ ఒక చిన్న కప్పు నిండా తినండి వీలయితే సాయంత్రం 4 గం అలా తినండి .
- ఎక్కువ క్రొవ్వు కలిగిన పాలు , పెరుగు మరియు నెయ్యిని తగ్గించండి
- పెరుగు కు బదులుగా మజ్జిగ ను వాడండి
- వరి అన్నాన్ని తినండి కానీ మీ కడుపును ఎక్కువగా ఆకుకూరలు కాయగూరలు ద్రవపదార్థాలతో నింపండి
- రోజు ప్రశాంతత కోసం ధ్యానం చేయండి ఒక 15 నిముషాలు
బరువు తగ్గాలంటే వీటిని తప్పకుండ పాటించండి :
- ఆశావహంగా ఉండండి
- ఆహార నిపుణుల సలహా తీసుకోండి
- తరచుగా మీ వెయిట్ లాస్ ప్రక్రియను మార్చకండి ఓపిక తో ఉండండి
పైన చెప్పిన వాటి ప్రకారం ఒక ప్లాన్ తయారుచేసుకోండి లేదంటే మమ్మల్ని WhatsApp లో అడగండి మేము సహాయం చేస్తాము వాట్సాప్ నం : 7989927156
- యంత్రాల మీద ఆధారపడటం తగ్గించుకోండి
- మీ దిన ప్రణాళికను మీ వెయిట్ లాస్ ప్రక్రియకు తగ్గట్టుగా మార్చుకోండి
- రేపు ఏమేమి తినాలి అనేది ఒక రోజు ముందే సిద్ధం చేసుకోండి
- వ్యాయామం , నడకని అసలే దాటవేయకండి
- మీరు అలసటగా ఉన్నట్టుగా అనిపిస్తే ఆరోజు వ్యాయామం చేయకండి
- గ్రీన్ టీ ఒక రోజులో 2 సార్లయినా తాగండి – పరిగడుపున త్రాగకండి
- ఒమేగా ఫాటీ ఆసిడ్స్ ఉన్న అవిసె గింజల ను ప్రతిరోజూ ౩ చెంచాలు తినండి
ఈ పద్దతుల వల్ల మీరు అధిక బరువు తగ్గడమే కాకుండా మంచి ఆరోగ్యవంతులవుతారు
ఇలా మీరు అన్ని ఒక పద్ధతి ప్రకారం పాటిస్తే మీరు కొన్ని రోజులలో నాజూకుగా ఆరోగ్యం గా తయారు కావొచ్చు .
మీకు ఏదయినా ఆరోగ్య సమస్యలు ఉంటె ముందుగా మీ వైద్యుని సలహా ప్రకారం ఈ బరువు తగ్గడం అనే ప్రయాణాన్ని ప్రారంభించండి.
జాగ్రత్తగా ఉండండి – పరిశుభ్రంగా ఉండండి – కరోనాకు వ్యతిరేకంగా పోరాడండి
మీ యొక్క విలువయిన సూచనలు మరియు సలహాలు ఈ క్రింద రాయండి