
కరోనా వైరస్ గత కొన్ని నెలలుగా ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది , ఈ వైరస్ వల్ల ప్రపంచం మొత్తం మీద కొన్ని లక్షల మంది మరణించారు. ఇంకా ఇది ఈ రోజు వరకు వ్యాపిస్తూనే ఉంది ఎంతో మందిని కబళిస్తూనే ఉంది
ఇప్పుడు మన భారత దేశం లో కూడా దీని వ్యాప్తి వేగంగా జరుగుతోంది ,దీని నుండి తప్పించుకోవడం ఎలా అనేది ఇప్పుడు ఉన్న అతి పెద్ద సమస్య .
కరోనా కి ఇప్పటి వరకు కచ్చితమయిన చికిత్స లేదు , చాల దేశాలు
దీనిని అడ్డుకోవడానికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో తలమునకలు అయి ఉన్నాయి .
భారత దేశం తో సహా ఇంకా కొన్ని దేశాలు ఎంతో పురోగతి సాధించాయి
కరోనా వైరస్ గురించి నిపుణులు , ప్రభుత్వాలు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు చూద్దాం ...
కరోనా వైరస్ (కోవిడ్-19) అంటే ఏమిటి :
కోవిడ్-19 అనేది కరోనా వైరస్ జాతికి చెందిన ఒక వైరస్ , ఈ జాతి వైరస్ లలో Middle East Respiratory Syndrome (MERS) and Severe Acute Respiratory Syndrome (SARS) కూడా ఉన్నాయి , ఇప్పుడు ఈ కోవిడ్-19 అనేది కనుగొన బడ్డది , ఈ వైరస్ లు అన్ని మన యొక్క శ్వాస అవయవాల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.
కరోనా వైరస్ (కోవిడ్-19 ) లక్షణాలు ఏమిటి ?
- జ్వరం
- పొడి దగ్గు
- అలసట
- ఇంకా కొన్ని ఇతర లక్షణాలు
- ముక్కు దిబ్బడ
- జలుబు
- ముక్కు కారడం
- తల నొప్పి
- గొంతు పొడిబారడం
- వాసనను పసిగట్టే గుణం కోల్పవడం
- చర్మం మీద రాషెష్
- విరేచనాలు
వయస్సు ఎక్కువగా ఉన్న వాళ్లలో శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది ముక్యంగా గుండె సమస్యలు ఉన్న వాళ్ళు , ఊపిరితిత్తులు , రక్తపోటు ,మధుమేహం ,క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్న వాళ్లకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది .
ఒక వేళ నాకు కరోనా లక్షణాలు కనిపిస్తే ఏంచేయాలి ?
మీకు లక్షణాలు చాల తక్కువగా ఉంటె మీ వైద్యుల సలహాలు , ప్రభుత్వ సలహాలు పాటిస్తూ .
కరోనా వైరస్ ఉందా లేదా అని టెస్ట్ చేసి తెలుసుకోవాలి
ఇంటిలో స్వంత సంరక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి , ఎవ్వరిని కలవకూడదు , ఇంట్లో వాళ్లకు కూడా దూరంగా ఉండండి , ఇంకా ఎక్కువ లక్షణాలు కనిపిస్తే మీ వైద్యులను సంప్రదించండి .
కరోనా వైరస్ ఎలా సోకుతుంది మరియు వ్యాప్తి చెందుతుంది ?
కరోనా వైరస్ ఉన్న వ్యక్తులు దగ్గినా లేదా తుమ్మినప్పుడు ఆ బిందువులు మన నోటిని ,ముక్కును మరియు కళ్ళను చేరినపుడు మనకు కరోనా వైరస్ సంక్రమణ జరుగుతుంది.
ఈ బిందువులు వస్తువుల మీద పడ్డప్పుడు ఎవరయినా వాటిని తాకి నోటిని , కళ్ళను ,ముక్కును ముట్టుకున్నపుడు ఈ వైరస్ వాటిద్వారా మన శరీరంలోకి చేరుతుంది
అందుకే కళ్ళను , ముక్కును మరియు నోటిని అనవసరంగా తాకకండి , సబ్బుతో చేతులను కడుకున్న తర్వాతనే తాకండి.
ఇపుడు ఉన్న కఠినమయిన పరిస్థితులలో మనల్ని మనం కాపాడుకోవటం ఎలా ?
ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల దాదాపు ప్రపంచం మొత్తం బాధపడాల్సి వస్తోంది ,ఇప్పుడు మన ముందు ఉన్న పెద్ద సవాలు దీని బారిన పడకుండా ఉండటం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ...
- బయటకు అసలే వెళ్ళకండి , అత్యవసరమయిన పరిస్థితులలో మాత్రమే వెళ్ళండి .
- ఎప్పుడు బయటకు వెళ్ళినా మంచి క్వాలిటీ మాస్క్ ను ధరించండి
- మాస్క్ తో మీ నోరు ముక్కును పూర్తిగా కప్పుకోండి
- మీ వెంట ఎల్లపుడు మంచి క్వాలిటీ శానిటయిజర్ ని ఉంచుకోండి
- బయట ఎవ్వరిని తాకకండి
- మీరు ఎక్కడయినా తాకితే చేతులను సబ్బు తో కానీ శానిటయిజర్ తో మీ చేతులను వెంటనే కడుక్కోండి ,మీకు అందుబాటులో నీళ్లు ఉంటె చేతులను శుభ్రంగా కడుక్కోండి .ప్రతి వస్తువు మీద కరోనా ఉండే అవకాశం ఉంది .
- బయటనుండి ఇంటికి వస్తే మీ బట్టలను వాష్ చేసుకోండి మీరు కూడా సుబ్బుతో స్నానం చేయండి .
- మీరు బయటినుండి తెచ్చిన వస్తువులను శుభ్రంగా కడగండి
- మీ నోటిని ,ముక్కును , కళ్ళను తాకకండి .
- మీ చేతులను తరచుగా కడుక్కోండి
- శారీరక పరిశుభ్రతను పాటించండి
- దుకాణాల దగ్గర ఎక్కువ మంది ఉంటారు జాగ్రత్తగా ఉండండి
- బయట అసలే తినకండి
- మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని మాత్రమే తినండి
- మీరు తినే ఆహారం లో అన్ని రకాల విటమిన్లు ఉండే లాగ మీ భోజనాన్ని ఏర్పాటు చేసుకోండి ముఖ్యముగా విటమిన్ సి , విటమిన్ డి, జింక్ మరియు ఇతర పోషకాలు .
- వేడుకలకు వెళ్ళకండి అక్కడ సమూహ వ్యాప్తి అధికంగా ఉంటుంది.
- ఆల్కహాల్ త్రాగడం మానేయండి దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది
- పెద్ద వయస్సు వాళ్ళు బయటకు వెళ్లకండి , ఇంటిలో మంచి ఆహారాన్ని తింటూ వ్యాయామం చేయండి .
ఎలాంటి ఆహారాన్ని తినాలి ?
మీ ఆహారం పరి శుభ్రంగా ఉండాలి
కూరగాయలు , ఆకుకూరలు మరియు పండ్లను శుభ్రంగా కడిగి వాడండి
అన్ని రకాల పండ్లు , జామ , బత్తాయి ,కమల పండ్లు , ఆపిల్ , దానిమ్మ , ఉసిరి వీటిని ఎక్కువగా తినండి .
ప్రతి రోజు తగినంత మంచి శుభ్రమయిన నీటిని త్రాగండి ,
రోజులో 2 సార్లు గోరు వెచ్చని నీటిని త్రాగండి
వ్యాయామం , నడక , యోగ ని చేయండి దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
శ్వాస కు సంబందించిన వ్యాయామాలను చేయండి ..వీటివల్ల మన శ్వాస ప్రక్రియ మెరుగవుతుంది.
మీరు పాజిటివ్ వ్యక్తులతో తిరిగినట్టయితే మీకు పాజిటివ్ లేకున్నా రక్షణ కోసం మీరు మీ ఇంటి లోనే కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉండండి.
తగిన జాగ్రత్తలను తీసుకోండి -కరోనాకు గురికాకండి
Add new comment