Image

 

కరోనా వైరస్ కు ఇప్పటివరకు సరయిన మందు లేదు కావున దీన్ని అడ్డుకోవడానికి   స్వీయ నియంత్రణ ఒక్కటే మనకు ఆధారం 

కరోనా రాకుండా  ఉండటానికి మన వద్ద ఉన్న మార్గాలలో అతి ముఖ్యమయినది మన యొక్క రోగ నిరోధకశక్తి ని మెరుగుపరుచుకోవడం .

మొదటగా మన యొక్క రోగ నిరోధకశక్తి తక్కువగా ఉందా అని తెలుసుకుందాం ..


ఈ క్రింది కొన్ని లక్షణాలు మనకు ఉంటె మన రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నట్లే.

  • ప్రతి చిన్న పనికి , విషయానికి  ఒత్తిడిగా లోనుకావడం
  • తరచుగా జలుబుకు గురికావడం
  • కడుపులో అసౌకర్యంగ ఉండటం
  • గాయాలు త్వరగా మానక పోవడం
  • తరచుగా ఇన్ఫెక్షన్స్  రావడం చెవి , ముక్కు , గొంతు ఇంకా ..వీటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు .
  • అలసటగా ఉండటం , శక్తి  ని కోల్పవడం
  • కాళ్ళు మరియు చేతులు వణకడం
  • వెంట్రుకలు ఎక్కువగా రాలిపోవడం
  • తరచుగా తలనొప్పి రావడం


ఇలా మనం కొంత అవగాహనకు రావొచ్చు మరియు మన కుటుంబ వైద్యున్ని అడిగి కూడా తెలుసుకోవచ్చు .
 
ఇప్పుడు ఆహారం ద్వారా రోగ నిరోధకశక్తి ని ఎలా పెంపొందించుకోవాలో చూద్దాం :

నిమ్మ జాతి పండ్లు :

నిమ్మ , బత్తాయి , సంత్ర , దూది నిమ్మ , ఉసిరికాయలు

ఈ పండ్లలో విటమిన్ సి ఉంటుంది , విటమిన్ సి తెల్ల రక్త కణాలను ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది  ,ఈ తెల్ల రక్త కణాలు వ్యాధులు రాకుండా ఇన్ఫెక్షన్స్ సోకకుండా కాపాడుతాయి.

అందుకే ప్రతి రోజు మన శరీరానికి మహిళలకు 75 మిల్లి గ్రాములు  , పురుషులకి 90 మిల్లి గ్రాముల  విటమిన్ సి అవసరం .

తప్పకుండ విటమిన్ సి ఆహారం లో ఉండేటట్టు చూసుకోండి

పసుపు

పసుపు లో ఉండే  కుర్కుమిన్  అనే పదార్థం మన కు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది .

మన భారతీయ వంటకాలలో పసుపును వాడటం అనేది అందరికి అలవాటే .

పసుపును వేడి పాలలో వేసుకుని తాగడం ఎంతో మేలు చేస్తుంది దీన్ని బంగారు పాలు అని కూడా అంటారు.

అల్లం

అల్లాన్ని మనం ప్రతిరోజూ వంటలలో , టీ లో వేసుకుంటాం ఇది మనకు ఉన్న ఒక గొప్ప అలవాటు.

అల్లం జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది , నొప్పులను వాపులను తగ్గిస్తుంది , చెడు క్రొవ్వులను లేకుండా చేస్తుంది , రక్తాన్ని శుభ్రపరుస్తుంది , దగ్గు జలుబు రాకుండా కాపాడుతుంది .

శ్వాశ ప్రక్రియను మెరుగుపరుస్తుంది

అల్లం ను పొడి లాగా కూడా వాడుకోవచ్చు మనం దీన్నే శొంఠి పొడి అంటాము

శొంఠి అన్ని పచారీ షాపులలో దొరుకుతుంది

బాదాం :

బాదాం లో విటమిన్ ఈ , విటమిన్ ఏ  మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి  .

యాంటీఆక్సిడెంట్స్ మన కణాలు దెబ్బ తినకుండా కాపాడుతాయి.
రోజు కనీసం 4 బాదాం పలుకులు అయినా తినాలి

క్యారెట్ , టొమాటోలు లలో కూడా యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి .

lemon

గ్రీన్ టీ:

గ్రీన్  టీ  లో ఆమినో ఆసిడ్స్ మరియు ఎల్  థయామిన్ ఉంటాయి .
ఎల్ థయామిన్ రక్తపోటు ను నియంత్రిస్తుంది .

గ్రీన్ టీ హృదయపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

దీంట్లో ఇంకా  విటమిన్ ఈ, సి ,బి 2  మరియు ఫోలిక్ ఆసిడ్ ఉంటాయి.

కావున ఎన్నో వ్యాధులు రాకుండా చూస్తుంది.


వెల్లుల్లి :

దీంట్లో  బాక్టీరియా మరియు వైరస్ లను పోరాడే శక్తి ఎక్కువగా  ఉంటుంది.

వెల్లుల్లి అద్భుతమయిన సహజమైన ఔషధం .

రక్త నాళాలు గట్టి పడటాన్ని ఆడుకుంటుంది మరియు రక్తాన్ని పలుచన చేస్తుంది

వీటితో పాటే అన్ని రకాల ఆకు కూరలను ,కాయగూరలు పండ్లు ఆహారంగా  తీసుకోవాలి.

మన రోగ నిరోధకశక్తి పెరగాలంటే ఆహారం తో పాటు ప్రతి రోజు 30 నిముషాలు వ్యాయామం  చేయడం ,నడవటం మర్చిపోకండి .

మనసు ప్రశాంతత కోసం ధ్యానం చేయండి

మంచి శుచిగా ఉండే ఆహారాన్ని తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి

కరోనా వైరస్ ను రాకుండా చూసుకోండి ఇది మీ చేతుల్లోనే ఉంది

ఈ యొక్క సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని రాయండి

Add new comment

CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions. Image CAPTCHA
Enter the characters shown in the image.

Home